![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -277 లో.....రామలక్ష్మి సీతాకాంత్ ఇంట్లో అందరికి బట్టలు తీసుకొని వస్తారు. ఇప్పుడేం పండుగ ఉందని ఇంట్లో వాళ్ళంతా అడుగగా.. అసలైన పండుగా ఉంది.. మా అమ్మ పుట్టినరోజు అని సీతాకాంత్ అంటాడు. ఎందుకు ఇవన్నీ అని శ్రీలత అనగానే.. అన్ని గొడవలు అయిపోయాక మొదటి పుట్టిన రోజు.. ఇది గ్రాండ్ గా చేద్దామని రామలక్ష్మి అంటుంది. అందరికి రామలక్ష్మి బట్టలిస్తుంది.
అప్పుడే శంకర్ వస్తాడు. అతన్ని చూసి సందీప్, ధన లు షాక్ అవుతారు. మళ్ళీ ఎందుకు వచ్చారని సీతాకాంత్ అడుగుతాడు. మేమ్ మాట్లాడుతామంటూ సందీప్, ధన లు శంకర్ ని పక్కకి తీసుకొని వెళ్తారు. అయినా శంకర్ వినడు.. నా అప్పు చెల్లించండి అని అడుగగా.. నీకు వీళ్ళు అప్పేంటని సీతాకాంత్ అడుగగా.. వాళ్ళు ఇవ్వాలసిన డబ్బు గురించి శంకర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన కూడా అప్పు ఎందుకు చేస్తున్నారని సీతాకాంత్ కోప్పడతాడు. నాకు సంబంధం లేదని సీతాకాంత్ అనగానే.. ధన, సందీప్ లు రామలక్ష్మి కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తారు. ఈ ఒక్కసారి క్షమించమని శ్రీలత అంటుంది. మా అమ్మ సిరి బాధపడుతుందని ఈ ఒక్కసారి క్షమిస్తున్నానని సీతాకాంత్ కోపంగా వెళ్తాడు. ఆ తర్వాత శంకర్ డైరెక్ట్ గా ధన గురించి నాతో చెప్పొచ్చు కదా.. ఎందుకు ఇలా చేసాడని రామలక్ష్మి ఆలోచిస్తుంది.
ఆ తర్వాత శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. అత్తయ్య మీరు నిజంగానే మారిపోయారా అని అడుగుతుంది. దీనికి డౌట్ వచ్చింది మేనేజ్ చెయ్యాలని.. అలా ఎందుకు అనిపించిందని అడుగుతుంది. శంకర్ ఇలా డైరెక్ట్ వచ్చి ఎందుకు అడిగాడని అనగానే శ్రీలత ఏదో డైవర్ట్ చేస్తుంది. అయినా నన్ను నమ్మవు.. నేను చేసిన పనులు అలాంటివనగానే సారీ అత్తయ్య తప్పుగా అర్థం చేసుకున్నానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. ధన కూడా సందీప్ లాగే అయ్యాడని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |